విశాలాంధ్ర- తాళ్లపూడి : ప్రజా సేవ లో ప్రభుత్వ అధికారులు, మీడియా మధ్య కోఆర్డినేషన్ అవసరమని, తాళ్లపూడి ప్రెస్ క్లబ్ సభ్యులు లో పాలను ఎత్తి చూపుతూ ప్రజలకు సక్రమ పరిపాలన అందించటం లో అధికారులతో మంచి కో ఆర్డినేషన్ కొనసాగిస్తారని కొవ్వూరు రూరల్ సి.ఐ విజయబాబు, తాళ్లపూడి ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పేర్కొన్నారు. ఇటీవల ప్రభుత్వం ద్వారా ఉత్తమ సేవ పురస్కారాలు పొందిన అధికారులు కు తాళ్లపూడి ప్రెస్ క్లబ్ అద్వర్యం చిరు సన్మానం జరిగింది. మండల పరిషత్ కార్యలయం లో జరిగిన సత్కారం లో ఆగస్టు 15 న సేవ పురస్కారాలు అందుకున్న కొవ్వూరు సి.ఐ విజయబాబు, తాళ్లపూడి ఎస్సై టి.రామకృష్ణ, తాళ్లపూడి ఎంపీడీఓ వేణుగోపాల రెడ్డి, ఎం.ఈ.ఓ.2 నెహ్రూజి, గోపాలపురం ఏ.ఎస్.ఓ జోడాల వెంకట్, అన్నదేవరపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డా.స్వర్ణలత, వైద్య సిబ్బంది నవీన్, రాయ్, శ్రీనివాస్ లను దుస్సాలువాతో పూలమాల్తో సత్కరించి మెమోంటో అంధ చేశారు. ఈ కార్యక్రమం లో ఆర్ ఐ రామకృష్ణ, ఎం.ఈ.ఓ బాలామణి, డా.అన్నపూర్ణ, వ్యవసాయ శాఖాధికారి రుచిత తది తరులు అతిథులుగా హాజరయ్యారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ప్రమోద్, సభ్యులు గుప్తా, ఉదయ్ భాస్కర్, సత్యనారాయణ, బ్రహ్మా నందం, గోపాల్ కృష్ణ, రామకృష్ణ, శ్రీనివాస్, రాజా, చినబాబు, నాగేంద్ర తదితర పాత్రికేయులు పాల్గొన్నారు.


