విశాలాంధ్ర ధర్మవరం;;రైల్వే రక్షణ దళం (ఆర్ పి ఎఫ్) లో విశిష్ట సేవలు అందించిన గుంతకల్ డివిజన్, రేణిగుంట ఆర్పీఎఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ కె. రాజగోపాల రెడ్డి ప్రతిష్ఠాత్మకమైన “రాష్ట్రపతి పోలీస్ పతకంను అందుకున్నారు.
ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో ఘనంగా నిర్వహించిన ఆర్ పి ఎఫ్ రైజింగ్ డే వేడుకల్లో ఆయనకు ఈ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేశారు. దశాబ్దాలుగా రైల్వే ఆస్తుల పరిరక్షణ, ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ మరియు అంకితభావంతో కూడిన సేవలకు గుర్తింపుగా ఆయనకు ఈ పురస్కారం లభించింది. అనంతరం
కె. రాజగోపాల రెడ్డి కు రాష్ట్రపతి పతకం లభించడం పట్ల గుంతకల్ డివిజన్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ , ఆర్పీఎఫ్ అధికారులు, ఇన్స్పెక్టర్లు , ఆర్పీఎఫ్ సిబ్బంది హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆర్పీఎఫ్ అధికారులు మాట్లాడుతూ రాజగోపాల రెడ్డి నిబద్ధత, కర్తవ్య నిర్వహణ , సేవా తత్పరతకు దక్కిన తగిన గౌరవం ఇది అని, ఆయన సాధించిన ఈ ఘనత గుంతకల్ డివిజన్ ఆర్పీఎఫ్ వర్గానికి ఎంతో గర్వకారణం అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆయన ప్రస్థానం భావితరాల ఆర్పీఎఫ్ సిబ్బందికి, నిరంతరం స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అని వారు కొనియాడారు.
రైల్వే ఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమిషనర్ కె. రాజగోపాల రెడ్డికి ప్రతిష్ఠాత్మక ‘రాష్ట్రపతి పోలీస్ పతకం’ బహుకరణ
- Advertisement -
RELATED ARTICLES


