Homeతెలంగాణనూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారులు

నూతనంగా బాధ్యతలు చేపట్టిన పోలీసు అధికారులు

- Advertisement -

ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో మర్యాదపూర్వక భేటీ

శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి – ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

విశాలాంధ్ర,షాద్ నగర్: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం నూతనంగా బాధ్యతలు చేపట్టిన కేశంపేట సీఐ శ్రీనివాస్, షాద్‌నగర్ ట్రాఫిక్ సీఐ వెంకటేశ్వర్లు షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఇరువురు పోలీసు అధికారులు ఎమ్మెల్యేకు మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ…. షాద్ నగర్ నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసు అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాంతిభద్రతల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా షాద్‌నగర్ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ, పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు తగ్గేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు