Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ హాస్పిటల్ పనిచేయాలి..

ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారమే ప్రైవేట్ హాస్పిటల్ పనిచేయాలి..

- Advertisement -

డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చెన్నారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం;; ప్రభుత్వ నియమ నిబంధనలు ప్రకారమే ధర్మవరం పట్టణంలోని ప్రైవేట్ హాస్పిటల్స్ కచ్చితంగా పనిచేయాలని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ చెన్నారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గల వారి కార్యాలయంలో పట్టణములోని ప్రైవేట్ ఆసుపత్రుల యజమానులతో (డాక్టర్లు) సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూచనలను వారు తెలియజేశారు. ప్రతి ప్రైవేట్ హాస్పిటల్ లేదా క్లినిక్ రిజిస్ట్రేషన్ తో పాటు రెన్యువల్స్ కూడా తప్పనిసరిగా ఎప్పటికప్పుడు చేయించుకోవాలని తెలిపారు. అర్హత ఉన్న డాక్టర్లు మాత్రమే సస్త్ర చికిత్సలు, వైద్య సేవలు అందించాలని వారు స్పష్టం చేశారు. అట్లు లేకుండా ఉల్లంఘించిన వారిపై కలెక్టర్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు వారిపై క్రిమినల్ కేసు తోపాటు ఆస్పిటల్ ను సీజ్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ హాస్పిటల్ యజమానులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు