: పార్వతీపురం మన్యంజిల్లా ఎన్జీఓ యూనియన్ మద్దతు ప్రకటన
విశాలాంధ్ర,పార్వతీపురం : ఫిబ్రవరి 8న విజయవాడలో జరగనున్న రాష్ట్ర ఏపి ఎన్ జి జి ఓ సంఘం ఎన్నికలలో కామ్రేడ్ అలపర్తి. విద్యాసాగర్, కామ్రేడ్ డివి. రమణలప్యానెల్ కే పార్వతీపురం మన్యం జిల్లా ఉద్యోగులు సంపూర్ణ మద్దతని జిల్లా అధ్యక్షులు జి విఆర్ఎస్ కిషోర్ తెలిపారు. గురువారం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించిఅంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసినట్లు తెలిపారు.ఆయనమాట్లాడుతూ ఉద్యగులశ్రేయస్సుకోసం నిరంతరం అలుపెరుగనిపోరాటం చేస్తూ, సమయానుకూలంగా పెండింగ్ బకాయిలను ప్రభుత్వంనుండి విడుదల చేయిస్తూ, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల హక్కుల కోసం నిరంతరం రాజీలేని పోరాటం చేస్తున్న వారికి మద్దతు తెలపడం మన బాధ్యతగా భావించి తీర్మానించి ఏకగ్రీవంగా అమోదించడం జరిగిందన్నారు. ఆలాగే నూతన రాష్ట్ర కార్యవర్గంలో జిల్లాకు, ఉమ్మడిజిల్లాకు అవకాశం బట్టి ప్రాధాన్యత కలిపించాలని, మరియు తెలుగువాడికీర్తిని జాతీయ స్తాయిలో వినిపిస్తూ మహారాష్ట్ర షిరిడిలో జరిగిన ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్య ఉద్యోగుల జాతీయ సమావేశంలో జాతీయఉపాధ్యక్షులులుగా ఎన్నికైన అలపర్తి విద్యాసాగర్ నిఅభినందిస్తూ తీర్మానంఅమోదించడం జరిగిందని తెలిపారు. జిల్లా కార్యదర్శి రంగాచారి మాట్లాడుతూ వీరిద్దరికీ మద్దతు తెలపడం మన అదృష్టమన్నారు. జిల్లాలో వున్న తాలూకా యూనిట్ అధ్యక్ష,కార్యదర్శులు ఉద్యగుల శ్రేయస్సుకోసం నిరంతరం పనిచేయాలన్నారు ఈకార్యక్రమంలో జిల్లా కార్యవర్గం, తాలూకా అధ్యక్ష, కార్యదర్శులు పట్టణ కార్యవర్గం పాల్గొన్నారు.
విద్యాసాగర్ , రమణ ప్యానెల్ కే మా మద్దతు
- Advertisement -
RELATED ARTICLES


