Homeజిల్లాలుపార్వతీపురం మన్యం"స్వీయగణనకార్యక్రమాన్ని" ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి

“స్వీయగణనకార్యక్రమాన్ని” ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి

- Advertisement -

విశాలాంధ్ర,పార్వతీపురం: జనగణన – 2027 ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి గురువారం తన గృహ సమాచారాన్ని స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదుచేసి అందరికీ ఆదర్శంగా నిలిచి జిల్లాలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రథమ పౌరుడిగా కలెక్టర్ స్వయంగా వివరాలు నమోదు చేయడం ద్వారా డిజిటల్ గణన ప్రాధాన్యతను చాటిచెప్పారు. అధికారులకు, ప్రజలకు ఈప్రక్రియపై అవగాహన కల్పించడంతో పాటు, అందరిలో స్ఫూర్తిని నింపారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుటుంబ గణన ప్రక్రియలో భాగంగా, ప్రజలు తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే సెల్ఫ్ ఎన్యుమరేషన్ విధానం గురువారం నుంచి అందుబాటులోకి వచ్చిందన్నారు. ఈవిధానం ఈనెల 30వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సెల్ఫ్ ఇన్యుమరేషన్’ విధానం అత్యంత పారదర్శకమైనదన్నారు. ప్రజలు తమ సొంత మొబైల్ ఫోన్లు ద్వారా తమ కుటుంబ వివరాలను ఖచ్చితత్వంతో నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వం కేటాయించిన పోర్టల్ లేదా యాప్ ద్వారా స్వయం గణన పూర్తి చేయాలని, ఇది ప్రభుత్వానికి సరైన గణాంకాలు అందించడంలో తోడ్పడుతుందని ఆయన కోరారు. గణన సిబ్బంది ఇంటికి వచ్చినప్పుడు సమయం వృధా కాకుండా, ముందుగానే ఈ ప్రక్రియ పూర్తి చేయడం వల్ల పని సులభతరం అవుతుందని వివరించారు. జిల్లావ్యాప్తంగా సెల్ఫ్ ఇన్యుమరేషన్‌పై విస్తృత ప్రచారం కల్పించాలని, ఎక్కడా సాంకేతిక ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.ఈకార్యక్రమంలో జిల్లా రెవిన్యూ అధికారి కె.హేమలత, గణాంకశాఖ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు