Homeఆంధ్రప్రదేశ్పార్వతీపురం మన్యంజిల్లాలో ప్రారంభమైన స్వీయ గణన( సెల్ఫ్ ఎన్యుమురేషన్)

పార్వతీపురం మన్యంజిల్లాలో ప్రారంభమైన స్వీయ గణన( సెల్ఫ్ ఎన్యుమురేషన్)

- Advertisement -

విశాలాంధ్ర,పార్వతీపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వీయగణనః (సెల్ఫ్ ఎన్యూమరేషన్) కార్యక్రమం జిల్లావ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. ఈకార్యక్రమంలో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తన వ్యక్తిగత వివరాలను ఆన్‌లైన్ ద్వారా స్వయంగా నమోదుచేసి శ్రీకారం చుట్టారు. ఈసందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి పౌరుడు తమ వివరాలను ఖచ్చితత్వంతో నమోదు చేసుకోవడం ద్వారా ప్రభుత్వ సేవలు మరింత వేగంగా అందుతాయన్నారు. ప్రజలే స్వయంగా వివరాలు నమోదు చేయడంవల్ల తప్పులు దొర్లే అవకాశం ఉండదని, అర్హులైన లబ్ధిదారులను గుర్తించి, ప్రభుత్వ ఫలాలు నేరుగా వారికి చేరేలా
ఈగణన దోహదపడుతుందన్నారు. రెవెన్యూ, సచివాలయ సిబ్బంది సమన్వయంతో పనిచేసి జిల్లాలో ఈకార్యక్రమాన్ని వందశాతం పూర్తి చేయాలని జేసీ ఆదేశించారు. ప్రభుత్వ పారదర్శకతలో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, ప్రతిఒక్కరూ బాధ్యతగా తమవివరాలను స్వీయ గణనలో నమోదుచేసుకొని విజయవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ పిలుపునిచ్చారు. తాను తన సెల్ ఫోన్లో నమోదు చేసిన స్వీయగణన వివరాలను పూర్తి చేసిన తర్వాత అధికారులకు,సిబ్బందికి చూపించారు. నేటి కాలంలో అందరూ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన వారు కనుక స్వీయ గణనకు ప్రాధాన్యతనిచ్చి వివరాలను నమోదు చేయాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు