Saturday, December 21, 2024
Homeఅల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత భారీగా పెరిగిన పుష్ప-2 కలెక్షన్లు..

అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత భారీగా పెరిగిన పుష్ప-2 కలెక్షన్లు..

ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ రికార్డుల బ్రేక్
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టై, బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత పుష్ప-2 కలెక్షన్లలో పెరుగుదల ట్రెండ్ కనిపిస్తోంది. వీకెండ్ అయిన రెండవ ఆదివారం (డిసెంబర్15) ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.75 కోట్ల పైచిలుకు వసూళ్లు రాబట్టిందని మూవీ కలెక్షన్లను ట్రాక్ చేసే ాశాక్‌నిల్క్్ణ కథనం పేర్కొంది. తెలుగు వెర్షన్ రూ. 16 కోట్లు, హిందీ వెర్షన్‌ ఏకంగా రూ.55 కోట్లు, తమిళం, కన్నడ, మలయాళం వెర్షన్లలో స్వల్ప మొత్తంలో వసూళ్లను రాబట్టిందని పేర్కొంది. ఆదివారం వచ్చిన భారీ కలెక్షన్లతో ఈ సినిమా విడుదలైన 11 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్ల మైలురాయిని అధిగమించిందని వెల్లడించింది. దీంతో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన మూడవ భారతీయ చిత్రంగా పుష్ప-2 నిలిచింది. ఆర్ఆర్ఆర్ (రూ.1,230 కోట్లు), కేజీఎఫ్: చాప్టర్-2లను (రూ.1,215 కోట్లు) పుష్ప-2 అధిగమించింది. ప్రస్తుతం బాహుబలి 2 (రూ.1,790 కోట్లు), ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ (రూ.2,070 కోట్లు) సినిమాలు మాత్రమే ముందున్నాయి. ప్రస్తుత ట్రెండ్ కొనసాగితే బాహుబలి-2 కలెక్షన్లను కూడా పుష్ప-2 అధిగమించే అవకాశాలు ఉన్నాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు