Saturday, March 29, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివాహనదారులకు నాణ్యమైన పెట్రోల్ డీజిల్ పంపిణీ చేయాలి

వాహనదారులకు నాణ్యమైన పెట్రోల్ డీజిల్ పంపిణీ చేయాలి

ఆర్డీవో మహేష్, డీఎస్ఓ వంశీకృష్ణారెడ్డి

వాటర్ బాటిల్, డ్రమ్ములలో పెట్రోల్ డీజిల్ వేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
విశాలాంధ్ర ధర్మవరం;; వాహనదారులకు నాణ్యమైన పెట్రోల్ డీజిల్ పంపిణీ చేయాలని, వాటర్ బాటిల్, డ్రమ్ములలో డీజల్ పెట్రోల్ వేస్తే కఠిన చర్యలు తప్పవు అని ఆర్డిఓ మహేష్, డిఎస్ఓ వంశీ కృష్ణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పట్టణంలోని దుర్గమ్మ గుడి వెనుక భాగానగల భారత్ పెట్రోల్ బంకును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంకులు పలు రికార్డులను వారు పరిశీలించారు. రోజువారి వివరాలను రిజిస్టర్లో రాయడం లేదని, స్టాకు కు, విక్రయానికి, మిగిలిన దానికి సరిగ్గా రిజిస్టర్ లో తప్పనిసరిగా రాయాలని తెలిపారు. అదేవిధంగా త్రాగునీరు లేదు అని, వాహనదారులకు ఉచితంగా అందించే గాలి పంపు కూడా లేదని, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటం చూసి, మండిపడ్డారు. చట్టం ప్రకారం ప్రతి పెట్రోల్ బంకులో త్రాగునీరు, ఉచితంగా గాలి, టాయిలెట్లు ఉండాలని తెలిపారు. పెట్రోల్ బంక్ అపరిశుభ్రతంగా ఎందుకు ఉందని వారు ప్రశ్నించారు. అదేవిధంగా అగ్నిమాపక పరికరాలు అన్నీ కూడా ఒక మూలన పెట్టడం, పనిచేయని గాలి మిషన్ చూసి వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తదుపరి పెట్రోలు, డీజిల్ స్టాక్ ను స్వయంగా రికార్డులు ప్రకారము ఉన్నాయా లేదా పరిశీలించారు. మీటర్ రీడింగ్, ట్యాంక్ రీడింగ్ కూడా వారు పరిశీలించారు. పెట్రోలు డీజిల్ లో కల్తీ ఉందా లేదా అనే విషయమై ఫిల్టర్ పేపర్ ద్వారా పరిశీలించి, కల్తీ లేదని స్పష్టం చేశారు. పెట్రోలు, డీజిల్ కొలతను కూడా వారు పరిశీలించారు. రికార్డులు ఎప్పటికప్పుడు తప్పనిసరిగా రాయాలని సూచించారు. అదేవిధంగా రోజువారి పెట్రోల్ వివరాలను కూడా రిజిస్టర్లో ఎందుకు రాయలేదని వారు ప్రశ్నించారు. మరోసారి తనిఖీకి వచ్చినప్పుడు రికార్డులు, తదితర విషయాలన్నీ కూడా స్పష్టంగా ఉండాలని లేనియెడల మీ పెట్రోల్ బంకు పై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పెట్రోల్ బంక్ యజమాని లేకపోవడంతో, సిబ్బంది ద్వారానే అన్ని విషయాలు అడిగి తెలుసుకుని, కొన్నింటిని ప్రయోగాత్మకంగా సిబ్బంది ద్వారా తనిఖీ చేయడం జరిగింది. అనంతరం డిఎస్ఓ, ఆర్డీవో మాట్లాడుతూ వాహనదారులు ఎవరు కూడా వాటర్ బాటిల్, ప్లాస్టిక్ చిన్న డ్రమ్ములలో వేసుకోరాదని, ఎక్కడైనా ఏదైనా ప్రమాదం జరిగితే బాదులు పెట్రోల్ బంక్ వారే అవుతారని తెలిపారు. పెట్రోల్ బంకును నియమ నిబంధనలు ప్రకారం నడుపుకోవాలని మరోసారి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం సిఎస్డిటి సురేంద్రనాథ్, డిప్యూటీ ఎమ్మార్వో సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు