Saturday, March 15, 2025
Homeజిల్లాలుకర్నూలురాష్ట్రస్థాయి జూడో పోటీలకు రేయిన్ బో విద్యార్థులు ఎంపిక

రాష్ట్రస్థాయి జూడో పోటీలకు రేయిన్ బో విద్యార్థులు ఎంపిక

విశాలాంధ్ర – పెద్దకడబూరు (కర్నూలు) : విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి జూడో పోటీలకు పెద్దకడబూరులోని రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. ఇటీవల ఆలూరు జరిగిన జిల్లాస్థాయి జూడో పోటీల్లో రేయిన్ బో పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కేపి. నరసింహులు, సి. వినోద్ ప్రతిభ చాటారు. వీరిని గురువారం పాఠశాల డైరెక్టర్ రంగారెడ్డి, ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, వ్యాయామ ఉపాధ్యాయులు అంజి, ఉపాధ్యాయులు పుల్లయ్య, రామకృష్ణ, శామ్యూల్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో మరెన్నో పోటీలలో పాల్గొని విజయాలు సాధించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు