విశాలాంధ్ర – రాజమండ్రి సిటీ ; రాజమండ్రి మార్కెట్ యార్డు నూతన కమిటీ బాధ్యతలు చేపట్టింది. రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గౌరవ చైర్మన్ గా గల నూతన కమిటీలో మార్ని వాసుదేవ్ చైర్మన్ గా, బోడపాటి గోపాలకృష్ణ వైస్ చైర్మన్ గా ఉన్నారు. నూతన కమిటీని నియమిస్తూ ఈనెల 10వ తేదీన అగ్రికల్చరల్ అండ్ కో ఆపరేషన్ (మార్కెటింగ్)శాఖ ఉత్తర్వులు జారీ చేయడంతో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం చేసింది. చైర్మన్ మార్ని వాసుదేవ్, వైస్ చైర్మన్ బోడపాటి గోపాలకృష్ణ, మెంబర్స్ బండి శ్రీ జ్యోతి, బొప్పన నాగేశ్వరరావు, దేవళ్ల రామ్ మోహన్ రావు, గంగిన జాహ్నవి, జంగా వినోద్ కుమార్ , కొల్లి బేబీ, కోమలి అయ్యన్నరావు, మామిడిశెట్టి సువర్ణ కుమారి, మంద హిమబిందు, బైరతి సరోజినీదేవి, గ్రంథి విజయ లక్ష్మి, కొప్పిశెట్టి మోహన్ గాంధీ, పన్నాల వెంకట లక్ష్మి బాధ్యతలు చేపట్టారు. అలాగే రాజమహేంద్రవరం రూరల్ ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘం పర్సన్ ఇంచార్జి, హక్కుంపేట ఆర్ బి కె అసిస్టెంట్ డైరెక్టర్, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసరు, తూర్పుగోదావరి జిల్లా అగ్రి ట్రేడ్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ కూడా ఈ కమిటీలో సభ్యులుగా వ్యవహరిస్తారు.
రాజమండ్రి మార్కెట్ యార్డు నూతన కమిటీ
- Advertisement -
RELATED ARTICLES


