Monday, November 17, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లా24 గంటల్లో దొంగ అరెస్ట్‌

24 గంటల్లో దొంగ అరెస్ట్‌

- Advertisement -

రూ.4.35లక్షల రికవరీ

విశాలాంధ్ర`విజయవాడ (క్రైం): ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడిన దొంగను విజయవాడ టూటౌన్‌ పోలీసులు 24గంటల్లో అరెస్టు చేశారు. ఆయోధ్యనగర్‌కు చెందిన తాడికొండ పవన్‌కుమార్‌ వద్ద నంచి రూ.4.35లక్షల నగదును రికవరీ చేశారు. కేసు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ టేనర్‌పేట అడ్డరోడ్డులో ఉప్పలపాటి రామంచద్రరాజు వీధిలో కొండ కృష్ణ అలియాస్‌ డేవిడ్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి నివాసముంటున్నారు. కొన్ని రోజుల క్రితం సొంత ఇల్లు కట్టుకుందామని, తెలిసిన వారి వద్ద నుంచి రూ.5లక్షలు అప్పుగా తీసుకోవచ్చి బీవారులో దాచారు. సోమవారం ఉదయం కుమారుడు పాఠశాలలకు వెళ్లగా, పాప నానమ్మ ఇంటికి వెళ్లింది. భార్యాభర్తలు ఇంటికి తాళం వేసి గుంటూరు జిల్లా పెదకాకాని దగ్గర ఉన్న చర్చికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చేలోగా ఇంటి తాళం పగలగొట్టి ఉంది. లోపలికి వెళ్లి చూడగా, బీరువాలో ఉండాల్సిన రూ.5లక్షలు చోరీకి గురైంది. దీంతో బాధితురాలు టూటౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్ధలానికి సీఐ కొండలరావు చేరుకుని నేరం జరిగిన తీరును ఆయన పరిశీలించారు. సీసీ కెమేరాల ద్వారా ఆయోధ్యనగర్‌కు చెందిన తాడికొండ పవన్‌కుమార్‌ను గుర్తించారు. అతను 20 రోజుల క్రితం ఇదే ఇంటికి ఏసీ టెక్నీషియన్‌గా వచ్చాడు. అతనిని 24గంటల్లో అరెస్టు చేసి, అతని వద్ద నుంచి రూ.4.35లక్షలు రికవరీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు