విశాలాంధ్ర- ధర్మవరం; ధర్మవరం పట్టణంలోని పిఆర్టి స్ట్రీట్ షాదీ మహల్ లో హజ్రత్ టిప్పు సుల్తాన్ టీం ధర్మవరం సభ్యుల ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ 200 మందికి పైగా నిరుపేదల కుటుంబాలకు రంజాన్ నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని హజరత్ టిప్పు సుల్తాన్ టీం సభ్యుల ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా హజరత్ టిప్పు సుల్తాన్ (రహంతుల్లా ఆలై) ధర్మవరం టీం సభ్యుల ఆధ్వర్యంలో కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజలకు సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కరోనా లాక్డౌన్ సమయంలో దాతల సహకారంతో ఆక్సిజన్ సిలిండర్స్ అందించామని, అదేవిధంగా ప్రతి నెల కొన్ని కుటుంబాలకు నిత్యవసర సరుకులను అందజేస్తూ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి సంవత్సరం రంజాన్ మాసంలో పేద ప్రజలు సంతోషంగా పండగ జరుపుకోవాలని ఉద్దేశంతో సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. దాతల సహకారంతో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామనితెలిపారు. ఈ కార్యక్రమంలో హజరత్ టిప్పు సుల్తాన్ రహంతుల్లా ఆలై ధర్మవరం టీం సభ్యులతోపాటు ధర్మవరం టౌన్ ముస్లిం మైనారిటీ పెద్దలు, మత గురువులు తదితరులు పాల్గొన్నారు.
200 వందలకు పైగా నిరుపేదల కుటుంబాలకు రంజాన్ నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమం
RELATED ARTICLES