విశాలాంధ్ర- అనంతపురం : రాష్ట్రీయ ఆయుష్ మెడికల్ అసోసియేషన్ (రామ) ఆనంతపురము జిల్లా సమావేశము స్థానిక గోకుల్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ లో ఆదివారం నిర్వహించారు.
ఈకార్య క్రమానికి విశిష్ట అతిధి గా దక్షిణాది రాష్ట్రాల కోఆర్డినేటర్ డాక్టర్. వీరబోయిని నాగేశ్వరరావు, రాష్ట్రానాయకులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్. పొగుల కుమారయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ నల్లపాటి తిరుపతి నాయుడు. మరియు డాక్టర్. ఎన్. మాలిక్ హజరయ్యారు,డాక్టర్ శంకర్ మహదేవన్ అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఆయుష్ వైద్య విధానాలైన ఆయుర్వేద,హోమియోపతి,యోగ,నాచురోపతి,యునాని వైద్యుల సమస్యలపై చర్చించారు. రామా అసోసియేషన్ ఆనంతపురము నగరము లో ఏప్రిల్ నెల 27 వ తేదీ కాన్సర్ పై నిర్వహించ బోతున్న సి ఎం ఇ కార్యక్రమానికి చేయవలసిన ఏర్పాట్లు గురించి , ప్రజలకి మెరుగైన ఆయుష్ సేవలను అందించటం గురించి వివరంగా తెలియజేశారు. అనంతరం నూతన జిల్లా కమిటీ ని ఎన్నుకున్నారు. ఈ కమిటీ లో గౌరవ అధ్యక్షులుగా. ప్రముఖ ఆయుర్వేద ఫిజీషియన్. డాక్టర్ బి. కేదార్నాథ్ . జిల్లా అధ్యక్షులుగా. డాక్టర్. ఎస్. శ్రీనివాస్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు డాక్టర్ జి.చంద్రమౌళి. జిల్లా జనరల్ సెక్రెటరీగా. డాక్టర్.ఎస్ గౌరీ శంకర్. జిల్లా ట్రెజరర్ గా డాక్టర్.టీ. మురళీకృష్ణ.. జాయింట్ సెక్రటరీస్ గా. డాక్టర్ బి. రఘు భూపాల్ రెడ్డి.డాక్టర్ టి.రియాజ్.. ఎగ్జిక్యూటివ్ మెంబర్స్. డాక్టర్ మల్లికార్జున గౌడ్. డాక్టర్ రామాంజనేయులు. డాక్టర్. ఎన్. షేక్షావలి. డాక్టర్ జీ.వి నీలేష్.. డాక్టర్ ఎస్.మహమ్మద్ రఫీక్.
డాక్టర్. రాజా నరసింగరావు లను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.
ఈ కార్య క్రమానికి జిల్లా కమిటీ పరిశీలకులుగా రాష్ట్ర మహిళా విభాగం రాష్ట్ర కోఆర్దినటర్లు డాక్టర్ శాంతి ప్రియ, డాక్టర్. వి.ఎన్.రజిత యాదవ్ పాల్గొన్నారు.అతిధులుగా సత్యసాయి జిల్లా ఆద్యుక్షులు డాక్టర్.వై అనురాధ , మరియు జిల్లా సెక్రటరీ తేజేశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.