Tuesday, April 1, 2025
Homeజిల్లాలునెల్లూరుభారతీయ రిజర్వ్ బ్యాంక్ అవార్డు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం

భారతీయ రిజర్వ్ బ్యాంక్ అవార్డు స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన కార్యక్రమం

విశాలాంధ్ర -వలేటివారిపాలెం : వలేటివారిపాలెం మండలంలోని పోకూరు నందు డిఈఏఎఫ్ ఆర్థిక సహాయంతో బ్యాంకు సేవలు గురించి మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీజీబీ రిటైర్డ్ మేనేజర్ సూర్య ప్రకాష్, అవార్డు సంస్థ అడ్మిన్ రాజేశ్వరి, ఫైనాన్షియల్ అడ్వైజర్ శివాజీ పాల్గొన్నారు. ఈ సందర్బంగా సూర్య ప్రకాష్ మాట్లాడుతూ ఖాతాదారులందరూ తప్పకుండా నామినేషన్ చేయించుకోవాలని కోరారు ఇంత మంచి కార్యక్రమం నిర్వహిస్తున్న రిజర్వ్ బ్యాంకు మరియు అవార్డు సంస్థకు ధన్యవాదాలు తెలియజేశారు.అనంతరం శివాజీ మాట్లాడుతూ అందరూ ఆర్థిక క్రమశిక్షణ నేర్చుకోవాలని, పొదుపు చేయటం అలవాటు చేసుకోవాలని ఇక్కడ తెలుసుకున్న విషయాలు స్నేహితులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు సంస్థ అడ్మిన్ రాజేశ్వరి మాట్లాడుతూ రుణం తీసుకున్న వాళ్లు సక్రమంగా చెల్లించి సిబిల్ స్కోర్ పెంచుకోవాలని, ఖాతాదారులందరూ సామాజిక భద్రతా పథకాలలో చేరాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్యాంకు ప్రతినిధి సేవలు మరియు నగదు రహిత లావాదేవీల గురించి కళాకారులు నాటికలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో అవార్డు సంస్థ ప్రతినిధులు శ్రీనివాసులు మాట్లాడుతూ పి పి టి ద్వారా సైబర్ మోసాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో పొదుపు గ్రూపు మహిళలు రైతులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు