Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వలన జరుగుతున్నాయి..

రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వలన జరుగుతున్నాయి..

- Advertisement -

రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి డాక్టర్ సంకారపు నరసింహులు
విశాలాంధ్ర ధర్మవరం; ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వలన జరుగుతున్నాయని రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ అధికారి, కంటి వైద్య నిపుణులు డాక్టర్ సంకారపు నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా వారు తమ క్లినిక్ లో జాతీయ రహదారి (ప్రయాణ) భద్రతా మాసోస్తవాల సందర్భంగా పలు విషయాలను వారు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రమాదాలకు ముఖ్య కారణం రహదారి నియమ నిబంధనలు (రోడ్డు సేఫ్టీ) పాటించకపోవడమే ప్రమాదాలకు హేతువు అవుతుందని తెలిపారు. అంతేకాకుండా ఓవర్టేక్ చేయడం, సెల్ఫోన్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా, సీటు బెల్టు లేకుండా ప్రయాణం చేయడం, మద్యం సేవించి వాహనాన్ని నడపడం, నిద్రమత్తులో వాహనం నడపడం లాంటివి ప్రమాదాలకు ముఖ్య కారణమని తెలిపారు. దీంతోపాటు డ్రైవర్లకు దృష్టిలోపం ఉండుట, దూర దృష్టి, కంటిలో శుక్లము-బట్టకు తెర కట్టినట్లు అగుపించుట, ఎల్ఈడి లైట్లు తో తీవ్రమైన వెలుగు రావుట కూడా ప్రమాదాలకు హేతువు అవుతుందని తెలిపారు. ప్రతి వాహనదారుడు వాహనం రాత్రిపూట నడిపేటప్పుడు డిమ్ అండ్ డిప్ తో ఇతర వాహనాలకు సూచించే విధంగా డ్రైవింగ్ చేయాలని తెలిపారు. వాహన చోదకులు విధిగా కంటి పరీక్షలతో కూడిన వైద్య పరీక్షలు చేయించుకోవాలన్నారు. డ్రైవర్లు కంటి పట్ల నిర్లక్ష్యం చేస్తే జీవితం సుఖమయం ఉండదని తెలిపారు. కావున డ్రైవర్లకు అందరికీ జనవరి ఒకటవ తేదీ నుంచి 31 వ తేదీ వరకు ఎస్బిఐ కాలనీలో కల మధు కంటి వైద్యశాల లో ఉచితంగా వైద్య చికిత్సలు అందిస్తామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. ప్రమాదం జరిగిన గంటలోపు చికిత్స సౌకర్యం కలిగిస్తే చాలావరకు మరణాలను నివారించే అవకాశం ఉంది అని తెలిపారు. ఈ నేపథ్యంలో జాతీయ రహదారుల వెంట అనుగుణంగా 50 కిలోమీటర్లకు ఒకచోట ట్రామా కేర్ సెంటర్ ను ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలిపారు. దీనివల్ల వెనువెంటనే చికిత్స పొందే అవకాశం కూడా కలదని వారు తెలిపారు. ప్రమాదంలో ఉన్నవారికి సహాయ వ్యక్తికి ఐదువేల రూపాయలు గుడ్ సమ రిటర్న్ పథకం కింద వర్తిస్తుందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు