Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబెస్త సంక్షేమ అభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేస్తాను..

బెస్త సంక్షేమ అభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేస్తాను..

- Advertisement -

రాష్ట్ర బెస్త సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ బెస్ట్ శ్రీనివాసులు
విశాలాంధ్ర ధర్మవరం:: బెస్త సంక్షేమ అభివృద్ధికి తాను అహర్నిశలు కృషి చేస్తానని ఇటీవల నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన రాష్ట్ర బెస్త అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ బెస్త శ్రీనివాసులు తెలిపారు. ఈ సందర్భంగా వారు జనసేన పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ తాను ఇటీవలే విజయవాడలో బీసీ భవన్ నందు రాష్ట్ర బీసీ చేనేత జౌళి శాఖ మంత్రి సవితమ్మ సమక్షంలో పదవీ బాధ్యతలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. ఈ పదవి తనుకు రావడానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డికి వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వారు ఆదేశాలను అనుసరిస్తూ పార్టీ సూచనలను పాటిస్తానని తెలిపారు. అదేవిధంగా మత్స్యకారులకు ఇంతకుముందు ప్రభుత్వములో ప్రమాదవశాత్తు చనిపోతే అప్పుడు ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఉండేదని, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక 10 లక్షలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని వారు తెలిపారు. అదేవిధంగా మత్స్యకారులకు చాపలు చెడిపోకుండా ఉండడం కోసం ఐస్ బాక్సులు, బోట్లు, సొసైటీలు, వలలు, కూటమి ప్రభుత్వములో తప్పకుండా లభిస్తాయని వారు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం వల్ల మత్స్యకారులకు ఎల్లవేళలా సహాయ సహకారాలు ఉంటాయని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు