విశాలాంధ్ర అనంతపురం : ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో గురువారం రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ మరియు బోటనీ లెక్చరర్ విష్ణు ప్రియా సమన్వయంతో ఏర్పాటు చేశారు. విద్యార్థుల్లో రోడ్డు భద్రతపై అవగాహన పెంచడం, బాధ్యతాయుతమైన డ్రైవింగ్ ప్రవర్తనను ప్రోత్సహించడం ప్రధాన ఉద్దేశ్యం.ఈ కార్యక్రమంలో ముఖ్యఅధికారులు పాల్గొన్నారు:
ఎం. వీర్రాజు, ఉప రవాణా కమిషనర్ మాట్లాడుతూ… భారతదేశంలో మరియు అనంతపురం జిల్లాలో రోడ్డు ప్రమాదాల గణాంకాలు వివరించారు. రోడ్డు ప్రమాదాలు వలన బాధితుల కుటుంబాలపై పడే భయంకరమైన ప్రభావం గురించి అవగాహన కలిగించి, ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవడానికి ట్రాఫిక్ నియమాలు పాటించాల్సిన అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. బి. సురేష్ నాయుడు, ప్రాంతీయ రవాణా అధికారి అనంతపురం, హిట్ అండ్ రన్ కేసులలో బాధితులకు అందజేయబడే నష్టపరిహారం గురించి వివరించారు. నష్టపరిహారం పొందే విధానం, ప్రభుత్వ సహాయం గురించి ఆయన వివరించారు. ఎస్. రమేష్, ప్రాంతీయ రవాణా అధికారి కళ్యాణదుర్గం, గుడ్ సమారిటన్ చట్టం గురించి విద్యార్థులకు అవగాహన కలిపించారు. ఈ చట్టం రోడ్డు ప్రమాదాల్లో సహాయం చేసే సాహసికులను రక్షించడం, వారికి లీగల్ సమస్యలు రాకుండా చూసుకునే విధానాలను వివరించారు. విద్యార్థులు అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు సహాయం చేయాలని ఆయన ప్రోత్సహించారు. గోల్డెన్ అవర్ గురించి వివరించారు.
అనంతరం, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మనోహర్ రెడ్డి, రోడ్డు సైన్స్ మరియు రోడ్డు మార్కింగ్ లపై అవగాహనా కల్పించారు.
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పద్మశ్రీ, వైస్ ప్రిన్సిపాల్ శశాంక మౌళి, అధ్యాపకులు డాక్టర్ సుధాకర్, డాక్టర్ రామకృష్ణ, సోమశేఖర్, శ్రీనివాస్, ఎసి ఐ విజయ భాస్కర్ మరియు సుమారు 500 మంది ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.
అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కాలేజీలో రోడ్ సేఫ్టీ అవగాహన కార్యక్రమం
RELATED ARTICLES