తిరుపతిలో గత రాత్రి జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారికి ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించింది. మరణించిన ప్రతి ఒక్కరికీ రూ.25లక్షలు అందజేయనున్నట్లు మంత్రి అనగాని సత్య ప్రసాద్ ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి కూడా తగిన నష్టపరిహారం అందజేస్తామన్నారు. గాయపడిన ప్రతి ఒక్కొరికీ వారు కోలుకునే వరకూ ప్రభుత్వమే వారి హాస్పిటల్ ఖర్చులు భరిస్తుందని, అవసరమైన అన్ని వైద్య సేవలు అందిస్తామని చెప్పారు.ఇదిలా ఉంటే నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మాజీ ముఖ్యమంత్రి జగన్ లు తిరుపతి వెళ్లనున్నారు. వారు బాధిత కుటుంబాలను పరామర్శించనున్నారు.
తొక్కిసలాట మృతులకు నష్టపరిహారం ఒక్కొక్కరికి రూ.25లక్షలు సాయం
RELATED ARTICLES