విశాలాంధ్ర -యస్ .రాయవరం : ఎస్ .రాయవరం మండల పరిషత్ అధ్యక్షురాలు గా కేసుబోయిన వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు .అనకాపల్లి జిల్లా ఎస్ .రాయవరం ఎంపీపీ కోన లోవ లక్ష్మి రాజీనామా చేయడం తో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకే గురువారం యస్ .రాయవరం మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి డిప్యూటీ కలెక్టర్ మనోరమ పర్యవేక్షణలో ఎన్నిక నిర్వహించారు వైసీపీ చెందిన కొరుప్రోలు ఎంపీటీసీ కసుబోయిన వెంకటలక్ష్మి పోటీ చేయగా ఎస్ రాయవరం ఎంపీటీసీ -2 బొలిశెట్టి గోవిందరావు ప్రతిపాదించారు వమ్మవరం ఎంపీటీసీ బాలం సూరిబాబు బలపరిచారు.టిడిపి పోటీ చేయకపోవడంతో ఎన్నిక ఏకగ్రీవం ఎన్నిక అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు .అనంతరం ఆమె చేత ప్రమాణం చేయించారు .వైసీపీ నుంచి 13 మంది,టిడిపి నుంచి ఒకరు హాజరయ్యారు .వివిధ కారణాలవల్ల ఆరుగురు ఎంపిటిసి గైర్హాజర్ అయ్యారు .ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ సత్యనారాయణ ,తదితరులు పాల్గొన్నారు .