సిఐటియు మండల కన్వీనర్ జే వి రమణ
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రభుత్వ పాఠశాలల్లో ఆయాలుగా పనిచేస్తున్న వారికి వేతనాలు పెంచాలని సిఐటియు మండల కన్వీనర్ జేవి. రమణ తెలిపారు. ఈ సందర్భంగా వారు ఆయాలతో సమావేశాన్ని నిర్వహించి అనంతరం వారు మాట్లాడుతూ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలకు కేవలం నాలుగు వేల రూపాయల వేతనమిస్తూ వారితో ప్రభుత్వం వ్యక్తి చాకిరీ చేయించుకోవడం ఎంతవరకు సమంజసమని వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు?. కనీస వేతనం అమలు చేయకుండా వారి కుటుంబాలు అనేక రకాల ఇబ్బందులు పడటానికి ప్రభుత్వం ప్రత్యక్షంగా కారణమవుతుందని వారు మండిపడ్డారు. కనీసం ఆయాలకు 10,000 వేతనం పెంచుతూ ప్రతినెల 5వ తారీఖు వారి ఖాతాలోకి జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో చౌడమ్మ, జయమ్మ, ముంతాజ్ ,భాగ్యమ్మ, గంగమ్మ, నాగలక్ష్మి, పర్వీన, నజమ్మ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలు ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలి;; అధ్యక్షులు బొగ్గు నాగరాజ్:::: మున్సిపల్ కార్యాలయంలో ఇంజనీరింగ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని అధ్యక్షులు బొగ్గు నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా రిలే నిరసనలో భాగంగా వారు మాట్లాడుతూ కార్మికులకు 26 వేల రూపాయల వేతనం ఇస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్నీ కూడా వర్తింపజేయాలని తెలిపారు. జీవో నెంబర్ 36 ప్రకారం వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. పనిని బట్టి అలవెన్స్ కూడా వర్తింపజేయాలని, కార్మికుడు చనిపోతే ఏడు లక్షలు ఇవ్వాలని తెలిపారు. పదవి విరమణ పొందిన తర్వాత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని తెలిపారు. 60 నుంచి 62 ఏళ్లకు ఉద్యోగ పరిమితి పెంచాలని, దహన సంస్కారాలకు 15 నుంచి 25 వేల రూపాయల వరకు పెంచాలని వారు తెలిపారు. మా న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే జూలై 4వ తేదీన విజయవాడలో జరిగే బహిరంగ సభలో సమ్మెకు ఏ తేదీన పిలిస్తే ఆరోజు సమలోకి దిగుతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి కాటమయ్య, కార్యదర్శి బాబు, చంద్రశేఖర్ రెడ్డి, దస్తగిరి, రాంప్రసాద్, యోగేష్ తదితరులు పాల్గొన్నారు.