Homeజాతీయంబీహార్ సీఎంగా సమ్రాట్ ప్రమాణ స్వీకారం

బీహార్ సీఎంగా సమ్రాట్ ప్రమాణ స్వీకారం

- Advertisement -

పట్నా: బీహార్ నూతన సీఎంగా బీజేపీ సీనియర్ నేత సమ్రాట్ చౌదరి బుధవారం పట్నాలోని లోక్ భవన్‌లో ప్రమాణం చేశారు. గవర్నర్ సయ్యద్ అట హస్నైన్… సమ్రాట్‌తో ప్రమాణం చేయించారు. ఇప్పటిదాకా సీఎంగా ఉన్న నితీశ్ కుమార్ రాజీనామా చేయడంతో సమ్రాట్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. బీహార్‌లో జేడీయూ, బీజేపీ, ఇతర పార్టీలతో కలిసి ఎన్‌డీయే కూటమి ప్రభుత్వం కొనసాగుతోంది. ఇంతకాలం జేడీయూ నుంచి నితీశ్ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించగా… డిప్యూటీ సీఎంగా ఉన్న బీజేపీ నేత సమ్రాట్ చౌదరి సీఎం పదవి చేపట్టారు. బీజేపీకి సీఎం పదవి దక్కడంతో జేడీయూకు రెండు డిప్యూటీ సీఎం పదవులు లభించాయి. జేడీయూ ఎమ్మెల్యే విజయ్ కుమార్ చౌదరి, బిజేంద్ర ప్రసాద్ యాదవ్ ఉపముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. బీజేపీ తరఫున బీహార్‌లో సీఎం పదవి చేపట్టడం ఇదే తొలిసారి. ఇప్పటి వరకు బీజేపీ కేవలం ప్రభుత్వంలో భాగ స్వామిగా మాత్రమే ఉంది. ఒక్కసారి కూడా బీజేపీకి సీఎం పదవి దక్కలేదు. తొలిసారి ఆ పార్టీ నుంచి సమ్రాట్ సీఎం పదవి చేపట్టి అరుదైన ఘనత దక్కించుకున్నారు. సీఎంగా ప్రమాణం చేసిన వెంటనే సమ్రాట్… సచివాలయానికి చేరుకుని బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం దేశంలో సీఎం పదవిలో కొనసాగుతున్న 16వ బీజేపీ నేతగా సమ్రాట్ నిలిచారు. అంటే… ప్రస్తుతం 16 రాష్ట్రాల్లో సీఎంలుగా బీజేపీ నేతలు కొనసాగుతున్నారు. దేశంలోని రాష్ట్రాల్లో ఇప్పటివరకు బీజేపీ తరఫున సీఎం పదవి దక్కిన 19వ రాష్ట్రం బీహార్. బీజేపీ చరిత్రలో ఆ పార్టీ నుంచి సీఎం పదవి దక్కించుకున్న 57వ వ్యక్తి సమ్రాట్. గతంలో ఆర్‌జేడీలో ఉన్న ఆయన 2017లో బీజేపీలో చేరారు. బీహార్‌లో వచ్చే నెలలో మంత్రివర్గ విస్తరణ జరగనుంది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు