Homeజిల్లాలుశ్రీ సత్యసాయిబాధలో ఉన్న కుటుంబానికి అండగా..సందా రాఘవ

బాధలో ఉన్న కుటుంబానికి అండగా..సందా రాఘవ

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; ప్రాణం పోయిన చోట మాటలు మౌనము అవుతున్నాయని, కానీ బాధలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు సంధ్యా రాఘవ అని రాఘవ టీం నాయకులు, తారక్ చేయుట ట్రస్ట్ అధ్యక్షులు రామాంజనేయులు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వనాథ పురానికి చెందిన షేక్ రమీజా మృతి చెందితే అంతక్రియలు చేయలేక ఇబ్బంది పడుతున్న రమీజా భర్త మా తారక్ చేయుట ట్రస్టును సంప్రదించిందని ఈ విషయాన్ని టిడిపి నాయకుడు, పట్టణ ప్రముఖ దాత సందా రాఘవ దృష్టికి తీసుకొని వెళ్లడం జరిగిందని తెలిపారు. అనంతరం రాఘవ అన్న ఫోర్స్ వాళ్ల టీం సభ్యుల ద్వారా ఆ గ్రామానికి వెళ్లి ఆ కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగిందని తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు సంద రాఘవకు, టీం సభ్యులకు, తారచైత ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చింతా లక్ష్మీనారాయణ, పోసి చంద్రమౌళి ,సాయి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు