Homeజిల్లాలుశ్రీ సత్యసాయిసమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే మంచి ఫలితాలు సాధించగలం..

సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే మంచి ఫలితాలు సాధించగలం..

- Advertisement -

యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రా రెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం : సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే మంచి ఫలితాలు సాధించగలమని యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయ చంద్రారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఓ, శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఉచిత మాక్ టెస్టు నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో గల పలు పాఠశాలల నుండి 600 మందికి పైగా విద్యార్థినులు హాజరు రావడం జరిగింది. ఈ సందర్భంగా జయ చంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం పదవ తరగతి విద్యార్థులకు సమయం చాలా తక్కువగా ఉన్నందున ఉన్న సమయంలోనే విద్యార్థులు ప్రణాళికా బద్దంగా చదివి మంచి మార్కులను సాధించాలని వారు తెలిపారు. అనంతరం 10వ తరగతి విద్యార్థులకు ఉచిత మాక్ టెస్టు
ప్రశ్నపత్రాలను విడుదల చేశారు. చదువుతో పాటు ఆరోగ్యం కూడా చూసుకోవాలని, మార్కుల వేటలో పడి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయడం మానుకోవాలని విద్యార్థులకు తెలిపారు. కళాశాల కరస్పాండెంట్ భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ప్రణాళికా బద్దంగా చదువుతూ ఏవైనా సందేహాలు ఉంటే అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకోవాలని అటువంటప్పుడే అనుకున్న ఫలితాలను సాధించగలరని తెలిపారు.డైరెక్టర్ బాలం లక్ష్మీనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాల నిర్వహణకు తాము ఎల్లప్పుడూ సహకారం అందిస్తామని, విద్యార్థులకు పరీక్షలంటే భయం లేకుండా చేయటం తమ అంతిమ లక్ష్యం అని, కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విద్యార్థులలో చైతన్యం కలిగించిన ప్రిన్సిపాల్, ఏఐఎస్ఓ మరియు ఏపీఎస్ఎఫ్ కార్యదర్శులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కరణం హర్షవర్ధన్, ఏఐఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ యాదవ్, ఏపీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బండి శివ, కళాశాల ఇంచార్జి రమేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు