విశాలాంధ్ర-ధర్మవరం : ధర్మవరం టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీలకు టూ టౌన్ సిఐ రెడ్డప్ప కౌన్సిలింగ్ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రౌడీలుగా ఉన్న మీరు ఇల్లీగల్ యాక్టివిటీస్ లో పాల్పడిన, ఏదైనా నేరాలు చేయడానికి కుట్రలు చేసిన, వెనక ఉండి ప్రోత్సహించిన, మద్యం సేవించి న్యూసెన్స్ చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకోబడుతుందని వారు హెచ్చరించారు. అంతేకాకుండా ఆరు నెలల లోపల రెండు లేదా అంతకన్నా ఎక్కువ కేసులు నమోదైతే వారిపైన పీడీ యాక్ట్ చట్టం కింద జైలుకు పంపడం జరుగుతుందని వారు హెచ్చరించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఎక్స్టైర్మెంట్కు ప్రతిపాదనలు చేస్తూ జిల్లా బహిష్కరణ చేయడానికి కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. కావున రౌడీ శీటర్లందరూ కూడా చట్టపరిధిలోనే జీవించాలని, కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని సుఖవంతమైన జీవితాన్ని గడపాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.
రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన టూ టౌన్ సిఐ రెడ్డప్ప
- Advertisement -
RELATED ARTICLES


