విశాలాంధ్ర – పాయకరావుపేట : జాతీయ రహదారి వై జంక్షన్ వద్ద ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు విగ్రహం శిధిలావస్థకు చేరుకోవడంతో దాని స్థానంలో కొత్త విగ్రహం ఏర్పాటు చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పునః ప్రతిష్ట పనులను తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ పెదిరెడ్డి చిట్టిబాబు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చించలపు ప్రదీప్, పట్టణ మాజీ అధ్యక్షులు మజ్జూరి నారాయణరావు, మండల తెలుగు యువత అధ్యక్షులు గొల్లపల్లి నాగు, రాజాన ఆది, వేములపూడి అప్పారావు, పడాల కోటి, జగతా శ్రీను, జగతా శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.


