విశాలాంధ్ర – పాయకరావుపేట : సాత్యకి ఆధ్వర్యంలో పట్టణంలోని రఘుపతి ఫంక్షన్ హాల్ లో మహిళలకు వివిధ రకాల పోటీలు ఏర్పాటు చేసి, ముందస్తు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రంగోలి, శారీ కాంపిటీషన్, శారీ హౌస్ తదితర పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోటీలలో గెలుపొందిన మహిళలకు మొదటి బహుమతిగా డ్రెస్సింగ్ టేబుల్, రెండవ బహుమతిగా స్మార్ట్ వాచ్, మూడవ బహుమతిగా 30 మందికి పట్టు చీరలు, వందమందికి పైగా లక్కీ డిప్ బహుమతులు, ప్రతి ఒక్కరికి ఒక బహుమతి వచ్చే విధంగా నిర్వాహకులు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంధి శ్రీనివాస్, కక్కిరాల నాని, పోలిశెట్టి రాజేష్, పురా సత్యనారాయణ, పోలిశెట్టి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.


