విశాలాంధ్ర – పాయకరావుపేట : మండలంలోని అరట్లకోట గ్రామంలో రామాలయంలో సప్త సప్తాహ మహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏట గ్రామంలో సప్తాహ మహోత్సవం నిర్వహిస్తూ వచ్చారు. ఈ ఏడాది సప్త సప్తాహం నిర్వహించాలని గ్రామ పెద్దలు నిర్ణయించారు. ఈ మేరకు గత నెల 12వ తేదీ నుంచి ఈనెల 30వ తేదీ వరకు 49 రోజులపాటు శ్రీ భగవాన్నామ భజన మహోత్సవాలు రాత్రి, పగలు తేడా లేకుండా నిర్వహిస్తారు. గ్రామంలోని కట్టా, నారపురెడ్డి, అనిమిరెడ్డి, పోతంశెట్టి, కర్రి, నడిగట్ల, తేనె కుటుంబాలకు చెందిన వారి ఆధ్వర్యంలో సప్త సప్తాహ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. సోమవారం నుండి కట్టా కుటుంబానికి చెందిన వారి ఆధ్వర్యంలో సప్త సప్తాహ మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సప్తాహ మహోత్సవాలు నిర్వహించడం వల్ల గ్రామానికి మంచి జరుగుతుందని, గ్రామంలో ప్రజలు సుభిక్షంగా ఉంటున్నారని, ఎక్కువమంది ప్రభుత్వ ఉద్యోగాలు సాధిస్తున్నారని తెలుగుదేశం పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు కట్ట శ్రీను తెలిపారు.


