Wednesday, November 27, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిధర్మవరంలో మున్సిపాలిటీ రిజర్వ్ స్థలాన్ని కాపాడండి…

ధర్మవరంలో మున్సిపాలిటీ రిజర్వ్ స్థలాన్ని కాపాడండి…

సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి-మధు
విశాలాంధ్ర ధర్మవరం: ధర్మవరం మున్సిపాలిటీ రిజర్వు స్థలాలను కాపాడాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యదర్శి మధు ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణంలో మున్సిపాలిటీ రిజర్వ్ స్థలాల్లో చాలావరకు ఇప్పటికే అక్రమాలు జరుగుతున్నాయి అని, సర్వే నంబర్లు 31,649, 650,ఇలా చాలా సర్వే నంబర్లు మన మున్సిపాలిటీ రిజర్వ్ స్థలాన్ని అక్రమార్కులు కబ్జాకి గురి చేయడం జరిగిందన్నారు. తదుపరి వైస్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, కేతిరెడ్డి కాలనీ, తుంపర్తి కాలనీ ల లో కూడా అన్యాక్రాంతం కావడం జరిగిందన్నారు..ఇప్పటికే ధర్మవరం పట్టణంలో చాలా చోట్ల రిజర్వ్ స్థలాల్ని కబ్జాకి గురికావడం జరిగిందని, విచారణ జరిపి ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్యక్రాంతం కాకుండా కాపాడాలని వారు తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీ ప్లానింగ్ అప్రూవల్ లేకుండా భవంతులు నిర్మిస్తున్నారని, మున్సిపాలిటీకి రావలసిన ఆదాయాన్ని గండి కొడుతున్నారని తెలిపారు. కానీ అధికారులు మాత్రం చూసి చూస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు అని తెలిపారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని తెలిపారు.
ఈ కార్యక్రమం లో సిపిఐ పట్టణ కార్యదర్శి, పి.రవికుమార్,సహాయ కార్యదర్శి వై.రమణ, చేనేత కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు వెంకట నారాయణ, వెంకటస్వామి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు, రాజా,,పట్టణ నాయకులు,శ్రీధర్,బాల రంగయ్య, భుజంగం,శ్రీనివాసులు,ఆదినారాయణ, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు