Thursday, December 12, 2024
Homeఆంధ్రప్రదేశ్టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి…

విశాలాంధ్ర – కొయ్యలగూడెం : తెలుగుదేశం పార్టీలో సభ్యత్వ కార్యక్రమానికి అనూహ్యస్పందన లభిస్తుందని టిడిపి పట్టణ అధ్యక్షులు జేష్ఠ రామకృష్ణారావు తెలిపారు. మండల కేంద్రం కొయ్యలగూడెం పట్టణంలో టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జేష్ట రామకృష్ణారావు మాట్లాడుతూ ప్రజలు, టిడిపి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం పొందడానికి ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. టిడిపి సభ్యత్వం తీసుకోవడం సమాజంలో ఒక గౌరవం, గుర్తింపుగా మారిందన్నారు. అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇచ్చిన రాజకీయ విశ్వవిద్యాలయం తెలుగుదేశం పార్టీ అన్నారు. కేవలం 100 రూపాయల సభ్యత్వంతో రూ.5 లక్షల భీమా సౌకర్యం కల్పించేలా టిడిపి సభ్యత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందన్నారు. టిడిపి సభ్యత్వం తీసుకోవడంతో పేద,బడుగు, బలహీన,వర్గాల ప్రజలందరికీ ప్రమాద బీమా వర్తిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి కూటమి ప్రభుత్వానికే సాధ్యమని అన్నారు. టిడిపి కార్యకర్తలు, ప్రజలందరూ టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో పట్టణ మహిళా అధ్యక్షురాలు దొడ్డపనేని దుర్గాదేవి, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు