కరెస్పాండెంట్ సీతాపతి రావు
విశాలాంధ్ర- ధర్మవరం;; విద్యార్థులకు విజ్ఞానం సైన్స్ ప్రదర్శన వల్ల ఎంతగానో ఉపయోగపడతాయని కరెస్పాండెంట్ సీతాపతి రావు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని సాధన ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో సైన్స్ డే ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకున్నారు. ముఖ్యఅతిథిగా శంకర్ నాయుడు విచ్చేసి, జ్యోతి ప్రజ్వలన గావించి, సైన్స్ డే ప్రదర్శనను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. తదుపరి విద్యార్థులు తయారుచేసిన వివిధ రకాలైన విజ్ఞాన శాస్త్ర నమూనాలను చూసి సైన్స్ డే గురించి వారు పలు విషయాలను విద్యార్థులకు తెలియజేశారు. ఈ ప్రదర్శనలో ప్రతిభా ఘనపరిచిన వారికి బహుమతి ప్రదానాన్ని పంపిణీ చేశారు. అనంతరం సీతాపతి రావు, శంకర్ నాయుడు మాట్లాడుతూ చదువుతోపాటు జనరల్ నాలెడ్జ్ కూడా విద్యార్థులకు ఎంతో అవసరమని, తీరితోపాటు ప్రాక్టికల్ కూడా ప్రాధాన్యత చాటుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భువనేశ్వరి దేవి, వాసవి, కుళ్లాయమ్మ, సాజిదా, మంజుల దేవి, శైలజ, లక్ష్మీనారాయణ ,సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.
విద్యార్థులకు సైన్స్ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయి
RELATED ARTICLES