పెద్దకడబూరు (కర్నూలు) : పెద్దకడబూరు మండలంలోని టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి ఆయిల్ పామ్ తోటను బుధవారం సీఐఆర్ ఏడీ కంపెనీ ఫ్రాన్స్ నుంచి నికోలస్ టర్నబుల్ , ఆమ్బ్రే ఫ్యాబింగ్, ఇండోనేషియా శాస్త్రవేత్త శ్రీ విజయన్, లివింగ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ టెక్నికల్ హెడ్ రంగనాయకులు సందర్శించి రైతులకు పామాయిల్ తోటల సాగు పైన సూచనలు సలహాలను ఇచ్చారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిని ఇచ్చే పంట ఆయిల్ పామ్ పంట అన్నారు. ఉద్యాన శాఖ నుంచి 100% సబ్సిడీతో మొక్కలు ఇవ్వడంతో పాటు, నాలుగు సంవత్సరాల పాటు నిర్వహణ ఖర్చుకై తోడ్పాటు, చిన్న,సన్నకారు రైతులకు ఉపాధి హామీ పని ద్వారా సహకారం ఉంటుందని తెలిపారు . ఈ ఆయిల్ పామ్ పంట సాగును చేపట్టదలచిన రైతులు మీ దగ్గరలోని రైతు సేవా కేంద్రం సిబ్బందిని సంప్రదించాలని కోరారు . ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ అధికారి అపర్ణ, విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ఇందు, లివింగ్ ఫుడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అసిస్టెంట్ మేనేజర్ సుమంత్ పాల్, ఫీల్డ్ ఆఫీసర్ ఇమ్రాన్, రైతులు పాల్గొన్నారు.