Wednesday, February 18, 2026
Homeజిల్లాలుఅనంతపురంస్కూటర్ల దొంగ అరెస్ట్

స్కూటర్ల దొంగ అరెస్ట్

- Advertisement -

విశాలాంధ్ర గుంతకల్: మండలంలోని బుగ్గ సంఘాల దగ్గర స్కూటర్ లు దొంగను అరెస్ట్ చేశామని కసాపురం పోలీస్ స్టేషన్ సిఐ ఎన్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక కసాపురం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సీఐ ఎన్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ అనంతపురం ఎస్పీ.జగదీష్ గుంతకల్ డిఎస్పి, ఉత్తరువు మేరకు గుంతకల్ రూరల్ ఇన్స్పెక్టర్ N. ప్రవీణ్ కుమార్ ఆద్వర్యంలో , కసాపురం పోలీసు స్టేషన్ ఎస్సై టి పి. వెంకటస్వామి తమ సిబ్బంది సహాయంతో కర్నూల్ జిల్లా,వెల్దుర్తి మండలం,లక్ష్మీనగారం కు చెందిన పింజరి షేక్షావలి(43) ను గుంతకల్ మండలం, సంగాల గ్రామానికి దగ్గర బుగ్గ సంగాల వద్ద నిన్న సాయంత్రం పట్టుకొని దొంగలించబడిన బజాజ్ పల్సర్ 125 సీసీ మరియు నాలుగు మోటార్ సైకిల్ లను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈముద్దాయిపై కసాపురం పోలీస్ స్టేషన్లో రెండు, కర్నూల్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఒకటి, గుంతకల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయన్నారు. ఈకేసులలో ప్రతిభ కనబరచిన ఎస్సై టి పి వెంకటస్వామి ని, ఏఎస్ఐ శ్రీనివాసులు ని, కాని స్టేబుల్ లు ఓబులేష్, జాఫర్, కిషోర్ కుమార్, దివాకర్, ఐటీ కోర్ టీం రఘు, అంజి, బాష, నజీర్, కుల్లాయప్ప, దాదా ఖలందర్ లను గుంతకల్ డి.ఎస్.పి అభినందించారని అన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు