మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం;; సచివాలయ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలను అందించాలని మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు పట్టణంలోని ఇందిరానగర్, గీతానగర్ ,పిఆర్టి వీధి సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం సచివాలయంలోని పలు రిజిస్టర్లను, రికార్డులను స్వయంగా పరిశీలించారు. రికార్డులను రిజిస్టర్ లను ఎప్పటికప్పుడు సంబంధిత విషయాలను తప్పక నమోదు చేయాలని ఉద్యోగులను ఆదేశించారు. అంతేకాకుండా కొన్ని సచివాలయాలలో ఉద్యోగానికి రాకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని వారు ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనుండి ఆకస్మిక తనిఖీలు నిరంతరం ఉంటుందని, అప్రమత్తంగా ఉండి తమ విధులను తప్పనిసరిగా సరైన సమయంలో సేవలు అందించాలని తెలిపారు. ఇకనుండి నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలతో పాటు జిల్లా ఉన్నతాధికారులకు నివేదికను పంపడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
సచివాలయ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
RELATED ARTICLES