Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక

రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు బాల్ బ్యాడ్మింటన్ అండర్ 16 బాలుర విభాగం లో అనంతపురం జిల్లా తరపున ముగ్గురు విద్యార్థులు ఎంపిక అవడం జరిగిందని ప్రధానోపాధ్యాయులు రామక్రిష్టప్ప, ఫిజికల్ డైరెక్టర్ నాగేంద్ర తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ న్యూ టౌన్ జూనియర్ కళాశాలలో బాల్ బాడ్మింటన్ అండర్ 16 బాలుర ఎంపికలు జరిగాయని, ఎంపిక అయిన ఎస్ మనోజ్ కుమార్, వై అశోక్, జి సాయి ప్రసాద్ ప్రకాశంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో జిల్లా తరుపున పాల్గొంటారని తెలిపారు. ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు ప్రకాష్, శ్రీనివాసులు, నాగేంద్ర, లలితమ్మ, నాగరాజు, రామాంజనేయులు తదితర ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేసి అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు