Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ కు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ విద్యార్థులు ఎంపిక

రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ కు జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ విద్యార్థులు ఎంపిక

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; మండల పరిధిలోని గొట్లూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ విద్యార్థులు ఈనెల 20వ తేదీన అనంతపురం కొత్త ఊరు జూనియర్ కళాశాలలో జరిగిన బాల్ బ్యాడ్మింటన్ కు రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొనే అవకాశం లభించిందని హెడ్మాస్టర్ జగన్నాథం ఫిజికల్ డైరెక్టర్ రమేష్ బాబు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ సబ్ జూనియర్ జట్టుకు 9వ తరగతిలో సాయి జాహ్నవి, జయవర్ధన్, జూనియర్ జట్టుకు 9వ తరగతిలో వినయ్, కమలాక్షి ఎంపిక కావడం జరిగిందన్నారు. ఎంపికైన వారు సబ్ జూనియర్స్ ఆగస్టు నెలలో ప్రకాశం జిల్లాలో జరిగే పోటీలలో, జూనియర్స్ వారు శ్రీ సత్యసాయి జిల్లాలలో జరిగే పోటీలలో అనంతపురం జిల్లా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తారు అని తెలిపారు. అనంతరం హెడ్మాస్టరు ఫిజికల్ డైరెక్టర్ పాఠశాల ఉపాధ్యాయులు, పాఠశాల కమిటీ, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు