విశాలాంధ్ర – ఎల్లనూరు (పుట్లూరు): పుట్లూరు మండలం పరిధిలోని అరకట వేముల గ్రామంలో మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడి హత్యాయత్నానికి ప్రయత్నించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీస్ కానిస్టేబుల్ మారుతిపై శనివారం కేసు నమోదు అయిన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. బాధిత మహిళ భర్త వివరాల ప్రకారం, నిందితుడి తరఫు వ్యక్తులు కేసు ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఈ ఒత్తిళ్లతో తీవ్ర మనోవేదనకు గురైన మహిళ పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు చెప్పారు.అస్వస్థతకు గురైన ఆమెను స్థానికులు వెంటనే అనంతపురం ప్రభుత్వ సాధారణ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు అయినప్పటికీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుల్‌ను ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్ చేయలేదని బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిందితుడు పోలీస్ సిబ్బందికి చెందినవాడే కావడంతో న్యాయం జరుగుతుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు, మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి చట్టపరమైన చర్యలు వేగవంతం చేయాలని కోరుతున్నారు
కానిస్టేబుల్‌పై లైంగిక వేధింపుల కేసు..బాధితురాలి ఆత్మహత్యాయత్నం
- Advertisement -
RELATED ARTICLES


