శంకర జయంతి కమిటీ, గాయత్రి బ్రాహ్మణ సంఘం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయంలో ఆది శంకర జయంతి వేడుకలు గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం కమిటీ, శంకర జయంతి కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా ఆదిశంకరాచార్యులు చిత్రపటానికి పూలు వేసి, ప్రత్యేక పూజలను అర్చకులు భరత్ వారి శిష్య బృందం నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల, బ్రాహ్మణుల నడుమ ఉపనయన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఇందులో భాగంగా పలువురు వటువులు కు ఉపనయనమును సాంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. ఈ ఉపనయన కార్యక్రమాలు పూర్తిగా ఉచితంగా నిర్వహించడం జరిగిందని కమిటీ వారు తెలిపారు. ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం అన్నసంతర్పణ కార్యక్రమానికి 300 మంది హాజరు కావడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీపతి, రామారావు, నంజుండ రావు, కిషోర్ తదితర సంఘ సభ్యులు పాల్గొన్నారు.
ఘనంగా శంకర జయంతి వేడుకలు..
RELATED ARTICLES