Friday, June 13, 2025
Homeజిల్లాలుఅనంతపురంసాయిబాబా స్కూల్ విద్యార్థినికి షైనింగ్ స్టార్స్ అవార్డు

సాయిబాబా స్కూల్ విద్యార్థినికి షైనింగ్ స్టార్స్ అవార్డు

విశాలాంధ్ర -తనకల్లు : మండల పరిధిలోని కొక్కంటి క్రాస్ లో సాయిబాబా స్కూల్ విద్యార్థిని ఎం.హసీబా 2024 -25 వ సంవత్సరం గాను పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఇచ్చే షైనింగ్ స్టార్ అవార్డుకు ఎంపికై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 20వేల రూపాయల నగదు మెడల్ తో పాటు అప్రిషియేషన్ సర్టిఫికేటు అందుకుంది. ఈ సందర్భంగా స్కూల్ ప్రిన్సిపాల్ సలీం భాషా మాట్లాడుతూ మా పాఠశాల విద్యార్థినికి ఈ అవార్డు రావడం ఎంతో సంతోషం కలిగించిందని స్కూల్లోని విద్యార్థిని విద్యార్థులంతా ఇలాంటి వాటిని ఆదర్శంగా తీసుకుని చదువులో బాగా రాణించాలన్నారు. అవార్డు అందుకున్న విద్యార్థినికి ఉపాధ్యాయ బృందంతో పాటు సహచరులు అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు