Wednesday, February 18, 2026
Homeజాతీయంపసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

పసిడి ప్రియులకు షాక్.. భారీగా పెరిగిన ధరలు

- Advertisement -

గత కొన్నిరోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ధరలు శుక్రవారం కాస్త తగ్గి పసిడి ప్రియులకు కొంత ఊరటనిచ్చాయి. కానీ, ఈ రోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. పేద, మధ్య తరగతి వారికి బంగారం అందని ద్రాక్షలాగా మారిపోయింది. రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతూ పోతున్నాయి. మధ్యలో కొంత తగ్గినా ఆ వెంటనే ఊహించని విధంగా పెరుగుతున్నాయి. గత కొన్నిరోజుల నుంచి పెరుగుతూ పోయిన బంగారం ధరలు శుక్రవారం తగ్గాయి. పసిడి ప్రియులకు కొంత ఊరటనిచ్చాయి. నిన్న స్వచ్ఛమైన బంగారం ధర రూ.1,43,400 దగ్గర ట్రేడ్ అయింది. కానీ, ఈ రోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.

ఈ రోజు బంగారం ధరలు..

ఈ రోజు (శనివారం) బంగారం ధరల విషయానికి వస్తే.. పది గ్రాముల 24, 22,18 క్యారెట్ల బంగారంపై వరుసగా రూ.380, రూ. 350, రూ.290లు పెరిగింది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,43,700 పలుకుతోంది. అలాగే పది గ్రాముల 22 క్యారెట్ల ధర రూ.1,31,800 దగ్గర ట్రేడ్ అవుతోంది. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.1,07,840 వద్ద ట్రేడ్ అవుతోంది.

వెండి ధరలు ఇలా..

బంగారం ధరల్లాగే వెండి ధరలూ పెరిగాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ.3,06,000 వద్ద ట్రేడ్ అయింది. 100 గ్రాముల వెండి ధర రూ.30,600 దగ్గర ట్రేడ్ అయింది. నేడు కిలో వెండిపై రూ.4000 పెరగ్గా.. 100 గ్రాములపై రూ.400 మేర పెరిగింది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.3,10,000 వద్ద, 100 గ్రాముల వెండి ధర రూ.31,000 వద్ద ట్రేడ్ అవుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు (24 క్యారెట్లు ఒక గ్రాముకు.. అంచనా)

హైదరాబాద్ – రూ.14,527.88

విజయవాడ – రూ.14,559.58

ఢిల్లీ – రూ.14,555.57

ముంబై – రూ.14,527.88

వడోదర – రూ.14,537.11

కోల్‌కతా – రూ.14,527.88

చెన్నై – రూ.14,527.88

బెంగళూరు – రూ.14,527.88

కేరళ – రూ.14,324.00

పుణే – రూ. 14,527.88

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు