Homeజాతీయంమహిళల రక్షణకు ‘సింగప్పెన్’ దళం

మహిళల రక్షణకు ‘సింగప్పెన్’ దళం

- Advertisement -


తమిళనాడులో ప్రత్యేక మహిళా పోలీస్ విభాగం ప్రారంభం
చెన్నై:
తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మహిళల భద్రత కోసం రాష్ట్రంలో ‘సింగప్పెన్ స్పెషల్ టాస్క్ ఫోర్స’ అనే ప్రత్యేక మహిళా పోలీస్ విభాగాన్ని ప్రారంభించారు. మహిళలు, పిల్లలపై నేరాలను ఆపేందుకు, ఏదైనా సమస్య వచ్చినప్ప్పుడు వెంటనే స్పందించేందుకు వీలుగా ఈ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ విభాగానికి రూ. 354 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. సింగప్పెన్ దళం చిహ్నాన్ని ఆవిష్కరించి…ఆ బృందాల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక గస్తీ వాహనాలను ప్రారంభించారు. ఓ వాహనాన్ని ఆయనే స్వయంగా నడిపారు. అనంతరం సీఎం విజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ మహిళా భయంతో జీవించకూడదని, సురక్షితంగా ఉన్నామనే భావనతో బయటకు రావాలని అన్నారు. స్త్రీలపై వేధింపులు కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదని, సమాజ సమస్యని విజయ్ పేర్కొన్నారు. మహిళలపై నేరాలను ఏమాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. రాష్ట్రంలో మహళలు, చిన్నారులపై నేరాలకు మాదకద్రవ్యాల వ్యాప్తికి సంబంధం ఉందన్నారు. డ్రగ్స్‌కు అలవాటుపడిన వారే ఎక్కువగా ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. విద్యార్థినులు, ఉద్యోగాలు చేసే మహిళల భద్రత కోసం సింగప్పెన్ బృందం రాష్ట్ర వ్యాప్తంగా డ్రోన్‌లను మోహరిస్తుందని తెలిపారు. వాటి సహాయంతో ఎక్కడ ఎవరు మహిళలను వేధించినా తక్షణమే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు