Homeఆంధ్రప్రదేశ్చిత్తూరులో సిట్ అధికారులు తనిఖీలు

చిత్తూరులో సిట్ అధికారులు తనిఖీలు

- Advertisement -

జిల్లా కేంద్రమైన చిత్తూరు నగరంలో బుధవారం మద్యం స్కా మ్ దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. చిత్తూరు నగరానికి చెందిన వైసిపి నేత విజయానంద రెడ్డి కి చెందిన ఇల్లు కార్యాలయాల్లో సిట్ అధికార బృందం తనిఖీలు నిర్వహించింది. నగరంలోని బీవీ రెడ్డి కాలనీలోని నలంద అపార్ట్మెంట్ లోని విజయానంద రెడ్డి ఇల్లు అతని కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. మద్యం కేసు దర్యాప్తు లో భాగంగా ఈ తనిఖీలు నిర్వహించినట్లు తెలిసింది. 2024 ఎన్నికల్లో విజయానంద రెడ్డి వైసీపీ తరఫున చిత్తూరు అసెంబ్లీ నియోజవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల సీట్ అధికారులు అతన్ని విజయవాడలోని ప్రధాన కార్యాలయానికి పిలిపించి విచారించారు. గతంలో మద్యాన్ని విజయానంద రెడ్డి మద్యాన్ని దుకాణాలకు సరఫరా చేసినట్లు సిట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఈ తనిఖీలు నిర్వహించినట్లు సమాచారం. చిత్తూర్ నగరంలో సిట్ అధికారులు తనిఖీలు కలకలం సృష్టించాయి.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు