విశాలాంధ్ర-తాడిపత్రి (అనంతపురం జిల్లా) : గన్నెవారి పల్లి కాలనీలోని రూరల్ పోలీస్ స్టేషన్లో రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లెల వేణుగోపాల్ ప్రత్యర్థి బిజిలి రామాంజనేయులు వర్గీయుల మధ్య ఈనెల మూడవ తేదీన వరాల తోట పంప్ హౌస్ వద్ద జరిగిన గొడవలలో దండు శ్రీనివాసులు, హాజీ భాష, అజయ్ లపై వేణ తన వర్గీయులతో దాడి చేశారు. ఈ దాడిలో దండు శ్రీనివాసులు, హాజీ భాష గాయపడ్డారు. పరారీలో ఉన్న నిందితులు శివాలయం వద్ద ఉన్నారని సమాచారం మేరకు ఎస్డిపిఓ రామకృష్ణుడు ఆదేశాల మేరకు రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి అయిన నేను ఎస్సైలు ధరణి బాబు, కాటుమయ్య పోలీసు సిబ్బందితో కలిసి తాడిపత్రి పట్టణంలోని అంబేద్కర్ నగర్ కు చెందిన మల్లెల నారాయణస్వామి కుమారుడు మల్లెల వేణుగోపాల్ అలియాస్ పొట్టి వేణు, వయస్సు 35 సంవత్సరాలు, శివాలయం వీధికి చెందిన చాకలి గోవిందు కుమారుడు చాకలి సురేష్ అలియాస్ గౌతమ్ వయస్సు 35 సంవత్సరాలు, షేక్ మహబూబ్ బాషా కుమారుడు షేక్ హుస్సేన్ వలి అలియా బడే, వయస్సు 27 సంవత్సరాలు, పోరాట కాలనీకి చెందిన చింతా రామకృష్ణ కుమారుడు చింత గోపీ కృష్ణనాథ అలియాస్ గోపి వయస్సు 26 సంవత్సరాలు, మెయిన్ బజార్ కు చెందిన షేక్ బాబు కుమారుడు షేక్ మహమ్మద్ హుస్సేన్ వయస్సు 33 సంవత్సరాలు, హరిజనవాడకు చెందిన బండారు వెంకట రంగయ్య కుమారుడు బండారు రామాంజినేయులు అలియాస్ అంజి, వయస్సు 23 సంవత్సరాలు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి కట్టెలు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకుని కోర్టుకు హాజరు పరచామని చెప్పారు.