Saturday, May 3, 2025
Homeజాతీయంగోవా ఆలయంలో తొక్కిసలాట..ఆరుగురు భక్తులు మృతి

గోవా ఆలయంలో తొక్కిసలాట..ఆరుగురు భక్తులు మృతి

గోవా రాష్ట్రంలోని శిర్గావ్‌లో ఉన్న లైరాయ్‌ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. జాతర సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోయినట్టు తెలుస్తోంది. పోలీసుల వివరాల ప్రకారం..శిర్గావ్‌లోని శ్రీ లైరాయ్‌ ఆలయంలో లైరాయ్‌ అమ్మవారి వార్షిక జాతర ఉత్సవాలు ప్రారంభమయినట్టు తెలుస్తోంది. ఈ జాతరను పుస్కరించుకొని అమ్మవారిని దర్శించుకునేందుకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున భక్తులు దర్శనానికి వచ్చారు. అయితే ఇక్కడి ఆయలంలో నిప్పుల గుండం తొక్కడం అనేది అనాదితా వస్తున్న ఆచారం. ఈ క్రమంలో శనివారం ఉదయం నిప్పుల గుండం తొక్కే తంతు మొదలు కావడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇందులో పాల్గొన్నారు. ఒక్కసారిగా భక్తు రద్దీ పెరగడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. భక్తులు ఒకరినొకరు తోసుకుంటూ ముందుకు సాగే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడంతో పాటు చాలా మంది భక్తులు గాయాలపాలయినట్టు తెలుస్తుంది. ఇక స్థానిక భక్తుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ సిబ్బంది. పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టి ప్రమాదంలో చనిపోయిన మృతదేహాలతో పాటు, గాయపడిన వారిని స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. అయితే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. శ్రీ లైరాయ్‌ ఆలయంలో వార్షిక జాతర సందర్భంగా అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వచ్చారు. అయితే భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఆలయ నిర్వహాకులు ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడంతోనే ప్రమాదం జరిగినట్టు పోలీసులు, స్థానికులు అనుమానిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు