విశాలాంధ్ర, ఉరవకొండ ( అనంతపురం జిల్లా) : మహాజన సామాజిక అభ్యుదయ సమాజ్ (ఎమ్మెస్ పిఎస్ ), మహాజన విద్యార్థి సంఘం (ఎం వి ఎస్ ) ఆధ్వర్యంలో “సమాజ జాగృతి–డ్రగ్స్ రహిత భారత్” కార్యక్రమంలో భాగంగా గురువారం ఉరవకొండ అంబేద్కర్ విగ్రహం వద్ద కరపత్రాలను విడుదల చేసి ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎం ఎస్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి నుంచి యువతను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని కోరారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి ప్రజలు, విద్యార్థులు, యువత సహకరించాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 23న అనంతపురంలో నిర్వహించనున్న “సమాజ జాగృతి–డ్రగ్స్ రహిత భారత్” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజు, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి చెన్న రాయుడు, మాజీ సర్పంచ్ జగదీష్, ఆనందరాజు, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు.


