విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ ఆధ్వర్యంలో ఉమెన్స్ ఈక్వాలిటీ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. హిందీ అధ్యాపకులు సోమశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మహిళల సమానత్వం, సాధికారత, విద్య మరియు సమాజ అభివృద్ధిలో మహిళల పాత్రపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సోమశేఖర్ మాట్లాడుతూ మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు కల్పించడమే ఆధునిక సమాజ అభివృద్ధికి కీలకమన్నారు. మహిళల హక్కుల కోసం జరిగిన పోరాటాలను గుర్తుచేసుకోవడమే ఉమెన్స్ ఈక్వాలిటీ డే ముఖ్య ఉద్దేశమన్నారు. ఉమెన్ ఎంపవర్మెంట్ సెల్ కోఆర్డినేటర్ జమీలా బీబీ మాట్లాడుతూ కుటుంబం, సమాజం, దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజం సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కెమిస్ట్రీ అధ్యాపకురాలు సుజాత మాట్లాడుతూ ఆడపిల్లలు, మగపిల్లలను సమానంగా చూడటం కుటుంబం నుంచే ప్రారంభం కావాలని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థినులు మహిళా సమానత్వం, విద్య, స్వావలంబన, సాధికారతపై ప్రసంగించారు. లెక్చరర్ గాయత్రి, ఇతర అధ్యాపకులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మహిళల హక్కులు, సమానత్వం, సాధికారతపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేలా విజయవంతంగా నిర్వహించారు.
మహిళా సమానత్వంపై అవగాహన పెంపొందించాలి
- Advertisement -
RELATED ARTICLES


