ఏపీ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు జూటూరు మహేంద్ర, ఏలుకుంట్ల గ్రామస్తులు
విశాలాంధ్ర ధర్మవరం ; మండల పరిధిలోని ఏలుకుంట్ల గ్రామములో స్మశాన వాటిక సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఏపీ మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు జూటూరు మహేంద్ర ఆధ్వర్యంలో ఏలుకుంట్ల మాల కులస్తుల తో కలిసి తాసిల్దార్ నటరాజుకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ సర్వే నెంబరు 94 లో 0-86, 80 సెంట్లు వంక పోరంబోకు స్థలం ఉందని అందులో గ్రామస్తులు స్మశాన వాటికగా ఉపయోగిస్తున్నారని తెలిపారు. అయితే అగ్రకులానికి చెందిన అమర నారాయణ, రామ నాయుడు ఆ స్థలాన్ని ఆక్రమించుకొని మాల కులస్తులు ఎవరైనా చనిపోతే అక్కడ కూర్చొకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కలెక్టర్కు, ఆర్డిఓ కు, తాసిల్దార్ కు వినతిపత్రాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
స్మశాన వాటిక సమస్యను పరిష్కరించండి..
RELATED ARTICLES