సిఐటియు నాయకులు
విశాలాంధ్ర -ధర్మవరం; ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆయాలు, స్వచ్ఛభారత్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఆర్డీవో మహేష్ కు వినతిపత్రాన్ని సిఐటియు నాయకులు అందజేశారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇ. ఎస్ వెంకటేష్, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పెద్దన్న, సిఐటియు మండల కన్వీనర్ జె వి రమణ, సీనియర్ నాయకులు ఎస్హెచ్ భాష,, కో కన్వీనర్ టీ అయ్యుబుఖాన్, మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న కంటెంట్ ఆయాలకు కేవలం 4000 రూపాయలతో గౌరవేతరమిస్తూ, స్వచ్ఛభారత్ కార్మికులకు కేవలం 6000 రూపాయలు ఇస్తూ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకుంటూ పని భారం పెంచుతున్నారని, పెరుగుతున్న నిత్యవసరస్థుల ధరలకు అనుగుణంగా వారికి జీతభత్యాలు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బాధ్యత కలదని తెలిపారు. కార్మికులకు కనీస వేతనం అమలు చేయాల ని, వారి వేతనాల కోసం ప్రత్యేక బడ్జెట్ ను కేటాయించాలని, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం ఏర్పాటు చేయాలని, ప్రభుత్వం 300 మంది విద్యార్థులకు ఒక ఆయాను కేటాయించడం చాలా బాధాకరమని, 50 మంది పిల్లలకు ఒక ఆయాని కేటాయించాలని ,ఆ విధంగా కార్మికుల సంఖ్యను పెంచాలని గ్రీవెన్స్ డే సందర్భంగా ఆర్డీవోకు వివరించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు ఎల్ ఆదినారాయణ, ఎస్ హైదర్ వలీ, చౌడమ్మ, జయమ్మ, వరలక్ష్మి, అంజనమ్మ, లక్ష్మీదేవి, వాణి తదితరులు పాల్గొన్నారు.
కార్మికుల సమస్యలు పరిష్కారం చేయండి..
RELATED ARTICLES