విశాలాంధ్ర. విజయనగరం జిల్లా.రాజాం
రాజాం మున్సిపాలిటీ కమిషనర్ జె.రామప్పలనాయుడు ఆదేశాల మేరకు సానిటరీ ఇన్స్పెక్టర్ చేగుంట హరిప్రసాద్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీ పరిధిలో ఆదర్శనగర్, మాదిగవీధి సచివాలయాల పరిధిలో సోమవారం నాడు శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వార్డులో ఉన్న ప్రతి వీధిలో చెత్తాచెదారాలు తీయించి, బ్లీచింగ్ జల్లించడం చేశారు. గత కొన్ని రోజుల క్రితం కురిసిన వర్షాలు కారణంగా దోమలు చేరి అంటు రోగాలు ప్రబలకుండా ఉండేందుకు ఈ చర్యలు చేపట్టామని కమిషనర్ తెలిపారు. ప్రతిరోజు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు సచివాలయాలు చొప్పున ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సానిటరీ సెక్రటరీలు, సానిటరీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.