విశాలాంధ్ర – కైకలూరు:కైకలూరు పట్టణంలో శ్రీసంతాన నాగేంద్రస్వామి ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్ట మహోత్సవాలు ఈనెల 2వ తేదీ నుండి నేటి వరకు నిర్వహించామని ఆలయ ధర్మకర్త చావలి శంకర శాస్త్రి తెలియజేశారు.కైకలూరు మార్కెట్ యార్డ్ ఎదురుగా ఉన్న శ్రీఆంజనేయస్వామి గుడి వెనుక కాలువ గట్టు నుండి దాన గూడెం వెళ్లే రహదారిలో వెలసిన శ్రీస్వామివారి ఆలయ పునర్నిర్మాణ ప్రతిష్టా కార్యక్రమాన్ని త్రయహ్నిక దీక్షతో ప్రారంభించి శ్రీగణపతి,శ్రీసంతాన నాగేంద్రస్వామి, శిఖర,నాగబంధ, మయూర వాహన ప్రతిష్ట కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. బుధవారం ఉదయం 8.46 నిమిషాలకు ప్రతిష్టా కార్యక్రమం జరిగిందని అనంతరం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివార్ల శాంతి కళ్యాణం,అఖండ అన్న సమారాధన చేపట్టినట్లు పేర్కొన్నారు.